![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-178 లో.... రామలక్ష్మికి సీతాకాంత్ చీర తీసుకొని వస్తాడు. అది చూసి సిరి ఏంటి అన్నయ్య అంటూ ఓపెన్ చేసి చూస్తుంది. చీర చాలా బాగుంది అన్నయ్య. నాకేనా అని అడుగుతుంది. సీతాకాంత్ సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి సీతాకాంత్ సైలెంట్ గా ఉన్నాడంటేనే అర్ధమవుతుంది. అది నీకు కాదని తన భార్య రామలక్ష్మికీ అయి ఉంటుందని పెద్దాయన అంటాడు. దాంతో సీతాకాంత్ సిగ్గుపడుతుంటాడు.
కాసేపటికి రామలక్ష్మికే కాదు అందరికి బట్టలు తీసుకొని వచ్చానంటూ సీతాకాంత్ అందరికి బట్టలు ఇస్తాడు. అప్పుడే రామలక్ష్మి బయటనుండి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావంటూ సీతాకాంత్ అడుగగా.. మీ బర్త్ డే కదా సూట్ తీసుకొని రావడానికి వెళ్ళానని రామలక్ష్మి సూట్ ఇస్తుంది. కాసేపటికి సీతాకాంత్ కూడా రామలక్ష్మికి చీర ఇస్తాడు. దాన్ని చూసి రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు త్వరగా వెళ్లి రెడీ అవ్వండి అని పెద్దాయన అంటాడు.అ తర్వాత సీతాకాంత్ సూట్ ని ప్రేమగా చూస్తుంటే పెద్దాయన వచ్చి.. అలా భార్య ఇచ్చిన సూట్ ని ప్రేమగా చూడటమేనా లేక నీ ప్రేమ విషయం చెప్పేది ఏమైనా ఉందా అని పెద్దాయన అనగానే.. నాకు ఈ రోజు ఉహించని గిఫ్ట్ అంటే తన ప్రేమ విషయం చెప్తుందేమో.. నేను కూడా నా ప్రేమ విషయం చెప్తానని అనుకున్నానని సీతాకాంత్ అంటాడు. ఈ రోజు నీ బర్త్ డేనే కాదు నీ జీవితం మలుపు తిప్పే రోజు కూడా అని పెద్దాయన అంటాడు. మరొకవైపు ఈ రోజుతో నీ లైఫ్ చేంజ్ అవుతుంది రా సందీప్ అంటూ తనని తను అద్దంలో చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే సూట్ వేసుకోండి అంటు సందీప్ కి సూట్ ఇచ్చి వేసుకోమని రమ్మంటుంది శ్రీవల్లి.
అ తర్వాత సందీప్ బిల్డప్ ఇస్తూ ఇక నందిని మేడమ్ వచ్చాక తన నిర్ణయం చెప్తుందని అంటాడు. ఆ తర్వాత బర్త్ డే కీ అందరు వస్తారు. ఈ బర్త్ డే మీకు చాలా స్పెషల్ అని సీతాకాంత్ ని పొగుడుతారు. సీతాకాంత్, రామలక్ష్మిలు దూరంగా ఉన్నా ఇద్దరు ప్రేమగా చూసుకుంటు వుంటారు. రామలక్ష్మి చీరపై శ్రీవల్లి కావాలనే జ్యూస్ పడగొట్టి సీతాకాంత్ ని డిస్సపాయింట్ చెయ్యాలని అనుకుంటుంది.కానీ జ్యూస్ సందీప్ పై పడగొట్టి తనతో తిట్లు తింటుంది శ్రీవల్లి. మీరేదో చెప్పాలని వచ్చినట్టు ఉన్నారు ఏంటి అది అని సీతాకాంత్ అడుగగా.. మీరేదో చెప్పాలి అనుకుంటున్నారని రామలక్ష్మి అంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |